
Why to chant Arjuna’s names when the Thunder Storm Occur
“ అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా
బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః “
ఇవన్నియును అర్జునుని బిరుదు నామములే. ఇది పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా జపించవచ్చు. మహాభారతం లో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది.
పాండవులు కౌరవుల చేతుల్లో పరాజితులై వనవాసానికి వెళ్తున్న సమయములో ఆయుధాలను శమీ వృక్షం (జమ్మి చెట్టు) పై దాచి ఉన్నారు. వారి అరణ్యవాసం సమాప్తిచెందు సమయములో దుర్యోధన దుస్యాసనులు వారి జాడ తెలుసుకుని యుద్ధానికి పూనుకున్నారు. ఆ సమయములో అర్జునుడు ఉత్తర కుమార యువరాజును పిలిచి ఆ శమీ వృక్షం పై ఉన్న ఆయుధాలను సేకరించుకొనిరమ్మని పంపెను. వెళ్లేముందు ఒక హెచ్చరిక చేసెను ‘ఆ చెట్టు మీద ఆయుధాలు లేనిచో లేదా క్రూరమైనవి కనపడినచో నన్ను స్మరించు అప్పుడు వెంటనే ఆ ఆయుధాలు ప్రత్యక్షమవుతాయి’ అని తెలిపెను. అమాయకుడైనటువంటి ఆ యువరాజుకి ఆ చెట్టు మీద ఆయుధాలకు బదులుగా క్రూర మృగాలు కనపడినవి. అప్పుడు ఆ యువరాజు భయముతో అర్జునా ఫల్గుణా అంటూ అర్జున నామములు పటించెను వెంటనే ఆ క్రూర మృగాలు ఆయుధాలుగా మారిపోయాయి. యువరాజు వాటిని అర్జునుని చేతికి అందజేసెను. ఆ అస్త్ర శస్త్రాలతో పాండవులు కౌరవులను జయించెను.
ఆ యుద్ధ రంగంలో అర్జునుడి రథచక్రం నింగికి ఎగసి ఒక పిడుగువలె భూమిని పెకలించివేసింది. దానితో శత్రు సైన్యం భయకంపితులై వెను తిరిగి పారిపోయినారు. అప్పటినుంచి ఎవరికీ భయం కలిగినా లేదా పిడుగులు పడిన అర్జున నామాలు స్మరిస్తే భయాందోళనలు తొలుగుతాయి అని నమ్మిక.