
Why Venkateswara Swamy Called as Niluvu Dopidi Vadu in Telugu
తిరుమల శ్రీనివాసుని పేర్లలోని కొన్నింటి ఔచిత్యాన్ని పరిశీలించి, అవగాహన చేసుకుంటే మనందరి కోసమే ఆ శ్రీవారు ఈ బిరుదు లన్నింటినీ తగిలించుకున్నాడేమో అని అని పించకపోదు.
ఆ దేవదేవుడం దరినీ నిలువుదోపిడీ చేస్తాడని అంటారు. అందరూ అనుకుంటున్నట్లు నిలువుదోపిడీ అంటే మన శరీరం మీద గల నగలూ నట్రా తీసేసుకుంటాడని కాదు. దీని అంతరార్ధం వేరే వుంది.
మానవుడు ఆశలపట్ట. అరిషడ్వర్గాలకు ఆశ్రయమైనవాడు. అలాంటి మానవుడిని ఉద్ధరించడానికే ఆ శ్రీవారు నిలువుదోపిడీ చేస్తారు. ఇక్కడ దోపిడీ చేయబడేవి నగా నట్రా కాదు. మనిషిని పట్టిపీడిస్తున్న అరిషడ్వర్గాలు, అంతులేని కోరికలు, శారీరక బాధలు, మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, ఇరుగూ పొరుగుతో విభేదాలు, పోరాటం, సంఘర్షణలను ప్రతి మనిషి తొలగించుకుంటే ప్రశాంతమైన, ఒడిదుడుకులు లేని జీవితాన్ని అనుభవిస్తాడు. అందుకే ఆ శ్రీనివాసుడు, అడు గడుగు దండాలవాడు, సంకటాలను హరించి, మనిషి లోగల సమస్త దోషాలనూ, దుర్గుణాలనూ నిలువుదోపిడి చేసి తద్వ్ద్రారా మనిషిని మానసికంగా, శారీరకంగా ప్రక్షాళన చేస్తాడు. పవిత్రుడిగా మారుస్తాడు. అదే “నిలువుదోపిడి’లోని అర్థం, పరమార్థం –
మనం తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకుంటాం. తలనీలాలను తీసేశాక మనం అందంగా లేమనే భావన కల్గుతుంది. అందచందాలు శాశ్వతం కావు. యవ్వనం క్షణభంగురం. జీవితం బుద్బుదప్రాయం – ఈ జీవితసత్యాన్ని మనకు తెలియజేసే దానికే ఆ ఏడుకొండల వాడు మన తలనీలాలు తీసేసుకుంటాడు. నిలువుదోపిడిలో ఇది కూడా ఒక అంశంగా భావించాలి.
Tirumala Related Posts
తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు | Places to Visit in Tirumala in Telugu.
తిరుమలలో భక్తలు చేయవలసినవి – Devotees Things to do in Tirumala