దొడ్డిదారిగుండా ఎందుకు ప్రవేశించకూడదు

0
2319

హనుమంతుడు సీతాన్వేషణకై సముద్రం దాటివచ్చి, లంకను సమీపించాడు. ప్రవేశద్వారం గుండాకాక – ప్రాకారం నుంచీ దుమికి, ఎడమకాలు పెట్టి లోనికి ప్రవేశించాడు. “అద్వారంగుండా నగరం, గ్రామం, ఇల్లు ప్రవేశించ రాదు’ అనే నియమం సామాన్యం. అది మిత్రులు, బంధువులు, మనశ్రేయస్సు కోరేవాళ్ల విషయంలో అద్వారప్రవేశం అధర్మమే! కానీ ధర్మశాస్త్రాలు,

“అద్వారేణ విశేత్ శత్రో:

పురం, గ్రామం, గృహం తథా”

అన్నాయి. కనుక శత్రువుల నగరాన్ని, గ్రామాన్ని, ఇంటినీ ప్రవేశించేటప్పుడు ‘అద్వారం’ గుండానే వెళ్లాలన్నారు. గృహప్రవేశకాలంలో, వివాహకాలంలో కుడికాలు ముందు పెట్టి, ప్రధానద్వారంగుండానే వెళ్లాలి. శత్రువుల ఇండ్లకూ, గ్రామాలకూ, నగరాలకయితే పెద్దలు సూచించారు. భారతంలో కృష్ణుడు, భీముడూ జరాసంధునిమందిరాన్ని అద్వారంద్వారానే ప్రవేశించారు. జరాసంధుడు “ఇలా అద్వారంలో ఎందుకు వచ్చా”రని ప్రశ్నించాడు. అందుకు కృష్ణుడుకూడా ఇదే నీతినే సమాధానంగా చెప్పాడు.

రావణుడు హనుమంతునికి ప్రత్యక్ష శత్రువుకాక పోయినా – తన ప్రభువైన రామునికి శత్రువైనందున – తనకూ శత్రువే అవుతాడు. కనుకనే ధర్మమూ, ధర్మ అద్వారంకుండా ఎడమకాలు ముందు పెట్టి ప్రవేశించాలని . సూక్ష్మాలూ చక్కగా తెలిసిన హనుమంతునికి – ఇలా ప్రవేశించుమని ఎవ్వరూ సూచించకపోయినా – అతడుమాత్రం స్మృతివాక్యాన్ని స్మృతికి తెచ్చుకొని, అద్వారాన్నే ఎంచు కొన్నాడు. ఇది శత్రునాశనానికి సంకేతం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here