అనంత పద్మనాభస్వామి ఆలయ ఆరవ నేల మాళిగ ద్వారం ఎందుకు తెరవలేకపోతున్నారు ..?

2
64485

anantha

కేరళ లోని తిరువనంత పురం లో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.అద్భుతమైన శిల్ప సంపదకు, అచ్చెరువొందించే స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులై భక్తులు ఆలయ దర్శనానికి తండోప తండాలుగా వచ్చేవారు. అకస్మాత్తుగా అక్కడి నేలమాళిగల్లో బయట పడ్డ అనంత సంపదకు ప్రపంచమంతా నిశ్చేష్టమైంది. ఎన్నో రోజులు వార్తల్లో అదే ముఖ్యాంశమై నిలిచింది. ఆలయ నేలమాళిగల్లో బయటపడ్డ బంగారు ఆభరణాలు,వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు,వింత వస్తువులు అందరినీ అబ్బురపరిచాయి. ఆలయ చివరి నేలమాళిగ ద్వారాన్ని మాత్రం తెరవడం ఎవరి వల్లా సాధ్యం కాలేదు. వాటిని తెరిచే ప్రయత్నం చేసిన అధికారులు మరణించడం, ఆ ద్వారం తెరవలేక పోవడం జరుగుతోంది.చివరికి సుప్రీం కోర్టు ఆ ద్వారం తెరవకూడదనే ఆదేశాలనిచ్చింది. ఇప్పటికీ ఆ ఆరవ నేలమాళిగ ద్వారం రహస్యాన్ని ఎవరూ ఛేదించలేక పోయారు.

ఆరవ నేలమాళిగ ద్వారం ఉత్కృష్టమైన నాగ పాశం తో సిద్ధ సాధువులు మంత్రోక్తంగా బంధించినట్లు తెలుస్తోంది. ఆ ద్వారానికి ఎటువంటి చిలుకు కానీ మేకులు కానీ లేవు. అది 16 వ శతాబ్దం లో మార్తాండవర్మ నిర్మింపజేసిన కట్టడం. ఎంతో మంది వేద పండితులు, తాంత్రికులు నాగ పాశాన్ని నిలువరించే గరుడ మంత్రాన్ని పఠించి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. మానవ మాత్రుల శక్తికందని ఏదో యోగ శక్తి ఆ సంపదను ఇప్పటికీ కాపాడుతోంది.

2 COMMENTS

  • Dear Suresh Namandi

   Please bear with us until we start English version. We are on the go with the developments. Every content will be available in English soon for your convenience.

   Thank you for your kind feedback. May the blessings of Her Almighty Aadi Shakti shower upon you.

   Jai MahaKali _/\_

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here