
2. బట్టలు ఉతికిన నీళ్ళు కాళ్లపై ఎందుకుపోసుకోరాదు?
మనం ఎన్నో రకాల ప్రదేశాల నుంచీ తిరిగి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. ఆ ప్రదేశాల తాలూకు మంచి చెడులు బట్టల కొసలకు అంటుకుని ఉంటాయి.
అంటే మనం బయటినుంచీ వచ్చేటప్పుడు కేవలం మురికిని మాత్రమే కాదు. కొన్ని ప్రదేశాలలోని చెడుని ఇంటికి మోసుకొస్తాం.
వాటన్నింటినుంచీ విముక్తి కోసమే ఆ మాసిన బట్టలను విడిచి శుచిగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలను వేసుకుంటాం.
మరి అలాంటప్పుడు ఆ మురికితో కూడుకున్న నీటిని కాళ్లమీద పోసుకోవడం ద్వారా శుభ్రత నశిస్తుంది. అంతేకాదు శని అపరిశుభ్రమైన పాదాల కూ, విరబోసుకున్న వెంట్రుకల కొనలకూ ఆకర్షితుడవుతాడు.
కనుక ఆ బట్టలను ఉతకడం ద్వారా మనం వదిలించుకున్న శనిని, మురికినీ, చెడు ప్రభావాలనీ తిరిగి మనతోపాటే మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకున్నవాళ్లమవుతాం.
కాబట్టి బట్టలు ఉతికిన నీటిని ఎట్టిపరిస్థితులలోనూ కాళ్లపై పోసుకోరాదు.
Promoted Content
లక్ష్మి మానస గారు శుబోదయము చాలా చక్కనివిషయాని చెప్పారు ధన్యవాదాములు