పరమేశ్వరుడు స్వయంగా చెప్పినమాట

0
4900

12 మాసములలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రావణము. దీనికి ఈపేరు శ్రవణనక్షత్రముతో కూడిన పూర్ణిమ నాడు రావడం వలన మాత్రమే కాక దీనియొక్క మాహాత్మ్యము వినుటకు ఆనందకరమై/యొగ్యమై అనేక సిద్ధులను ఇచ్చునది గావున ఈపేరు వచ్చినది.

శ్రావణ మాసంలో విధింపబడిన విధులలో ఏ ఒక్కటి అయినా శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు. నాకు ఈ మాసము కంటే ప్రియమైనది మరియొకటి లేదు. ఈమాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరుస్తాను. కోరికలు లేకుండా పూజించిన వారికి మొక్షాన్నీ ఇస్తాను. ఈ మాసంలో ఏ ఒక్క తిథి, వారము కూడా వ్రత ప్రాముఖ్యము లేకుండా లేవు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈమాసం గురించి చెప్తూ –ఎవరైతే శ్రావణ మాసంలో ఏక భుక్తము (ఒక్కపూట భోజనం) చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.

ఈ నెలలో దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. ఫలహారము లేదా హవిష్యాన్నాము ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు. ఈ మాసంలో చేసే నమస్కారములు, ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here