
కాల సర్పదోషాన్ని నివారించే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వరుడు | Worship Kukke Subramanya to Avoid Kala Sarpa Dosha
అత్యద్భుతమైన కుమార పర్వత ప్రాంతం లో ప్రకృతి సౌందర్యామంతా రాశులు పోసినట్లు పచ్చని పరిసరాలు.
బ్రహ్మాదులు కుమారస్వామికి అభిషేకం చేసిన మంత్ర జలాలతో ఏర్పడ్డ కుమారధార.
దక్షిణ కన్నడ ప్రాంతం లో మంగళూరుకి 105 కిలోమీటర్ల దూరం లో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంటుంది. పూర్వ కాలం లో ఈ క్షేత్రాన్ని ‘కుక్కి పట్టణం’ అనిపిలిచేవారట.
కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్ర స్థలపురాణం : కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్ర మాహాత్మ్యం గురించి స్కాంద పురాణం లోని సనాత్కుమార సంహిత లోగల సహ్యాద్రి ఖండం లో చెప్పబడింది.
శంకర విజయం లో నూ ప్రస్తావించబడింది. పురాణ గాధ ప్రకారం, సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుని,శూరపద్మాసురుని సంహరించిన తరువాత తన అన్న వినాయకుని ఇతర దేవతలనీ వెంటబెట్టుకుని కుమార పర్వతం చేరుకున్నాడు.
దేవతలంతా సుబ్రహ్మణ్యుని విజయానికి పుష్పవర్షం కురిపించారు. ఇంద్రుడు తన కూతురు దేవసేనను కుమార స్వామికిచ్చి వివాహం జరిపించాడు.
బ్రహ్మాది దేవతలంతా కుమారస్వామికి దివ్య మంత్ర జలాలతో అభిషేకించారు. అదే నేటి కుమార ధార.
మార్గ శిర శుద్ధ షష్టినాడు స్వామి వివాహం జరిగింది.
పరమ శివ భక్తురాలు వాసుకి గరుత్మంతునికి భయపడి ఎన్నో సంవత్సరాలుగా అక్కడి బిలద్వార గుహలలో దాక్కుని తపస్సు చేస్తూ ఉంది.
వాసుకి ని కరుణించిన మహాదేవుడు ఆమెకు అభయమివ్వమని కుమారస్వామిని ఆదేశించగా స్వామి వాసుకికి ప్రత్యక్షమై ఇక మీదట గరుడుని గురించి భయపడ వద్దనీ, తానే స్వయంగా గరుడుని బారినుండీ రక్షిస్తాననీ షణ్ముఖుడు వాసుకికి అభయమిచ్చాడు. అక్కడే కొలువు తీరాడు.
షణ్ముఖుని రక్షణ లో ఉన్న ఆ వాసుకినీ, స్వామినీ భక్తితో కొలిచిన వారికి కాలసర్పదోషం తో సహా సకల సర్ప దోషాలూ తొలగుతాయి.
Subrahmanya Swamy Related Posts:
భోగ భాగ్యాలను ప్రసాదించే సుబ్రహ్మణ్య పంచరత్నం | Subrahmanya Panchartnam In Telugu
ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామి షష్టి | Subramanya Swamy Shasti in Telugu
సుబ్రహ్మణ్య స్వామి కి ఉన్న ప్రముఖ మైన పేర్లు | Subramanian Swamy God other Names in Telugu
శ్రీ సుబ్రాహ్మణ్య అష్టోత్తర శతనామావళిః | Shri Subramanya Ashtotara Shatanamavalli In Telugu.
Rahu-Kethu pooja are performed at Shiva temple at Shivapuri, Nagole, Hyderabad too.