
Hanuman Pooja in Telugu
Hanuman Pooja in Telugu – జాతక దోషాల వల్ల అనారోగ్యాలు కలిగినా, మరే ఇతర ఇబ్బందులు ఎదురైనా, విద్యా ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధించాడానికైనా హనుమంతునికి మండలం(40) పాటు తోక పూజ చేయడం వలన అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. హనుమంతుని ఎన్నోరకాలుగా పూజిస్తాం. అయితే ఆ పూజలలో ఆయన వాలాగ్ర పూజ విశిష్టమైనది.
1. హనుమంతుని తోక పూజ ఎలా చేయాలి..?
ఒక శనివారం నాడు తోకపూజను ప్రారంభించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఆంజనేయుని పటాన్ని పూలతో అలంకరించాలి. శాస్త్రోక్తంగా పూజ చేసి స్వామి పటం / విగ్రహం లోని తోక కు ఒక గంధపు చుక్కను దిద్దాలి. హనుమత్ లాంగులాస్త్ర స్తోత్రం పఠించాలి. దగ్గర్లో ఉన్న ఆంజనేయుని ఆలయాన్ని దర్శించి స్వామికి 108 ప్రదక్షిణలు చేయాలి. లేదా ఇంట్లోనే స్వామి పటం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. స్వామికి నైవేద్యం సమర్పించి శాస్త్రోక్తంగా పూజ ముగించాలి. నలభైరోజుల తరువాత చివరిరోజున ఉద్యాపన చెప్పుకుని, స్వామికి తమలపాకులతో, సిందూరంతో పూజ చేసి, అన్నదానం చేయాలి. ఈ విధంగా నలభై రోజుల పాటు చేయడం వలన ఆంజనేయుని కృపకు పాత్రులవుతారు.
Everything is very open with a precise description of the issues.
It was definitely informative. Your site is useful.
Thank you for sharing!