షష్టి దేవిని పూజించు విధానం | Worship of Shashti Devi In Telugu

0
5296
 Shashti Devi
Worship of Shashti Devi In Telugu

Worship of Shashti Devi In Telugu

షష్టి దేవిని ఎలా ఎవరు పూజించాలి

సంతానం లేనివారికి సంతానాన్ని; పుత్ర సంతాన్ని కోరే వారికీ పుత్రున్ని
ప్రసాదించే తల్లి ” షష్టి దేవి ” .
అంతే కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే తల్లి .

పిల్లలు లేని వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు, మగ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు వీరంతా స్ ష ష్టి దేవిని తప్పక పూజించాలి

ప్రసవం అయిన స్త్రీ పురిటి స్నానం అయిన 5,6 రోజుల్లో కూడా షష్ఠి దేవి స్తోత్రం చదవాలి .

ప్రతి స్త్రీ కి తప్పకుండా షష్టి దేవి స్తోత్రము వచ్చి ఉండాలి .  చదవాలి  గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠిదేవి స్తోత్రం చదివితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది.

పిల్లల తల్లిదండ్రులు ప్రతి సం పిల్లల పుట్టినరోజు కు షష్టి దేవి స్తోత్రము పిల్లలకు 12 సం వచ్చువరకు తప్పకుండా చదవాలి.

కొంతమంది పిల్లలు కొన్ని సార్లు ఆరోగ్య బాగ లేక మరియు దృష్టి దోషం వలన ఎక్కువగా ఏడుస్తుంటారు అప్పుడు వెంటనే షష్టి దేవి స్తోత్రం పిల్లల తల్లిదండ్రులు చదివి కుంకుమ గాని, విభూతి కానీ పిల్లల నుదుటి పైన పెట్టాలి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది

=== షష్టిదేవి స్తోత్రం ==== :

నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః
సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః
సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః
కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః
శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః
ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే
కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః

ఫలశృతి :–:

ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత
షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే

శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here