
బదరీ పత్రం | badari patram
లంబోదరాయ నమః బదరీ పత్రం సమర్పయామి
బదరి అనగా రేగు, జిట్రేగు, గంగ రేగు అని ఫలముల పరిమాణమును బట్టి మూడు రకములు. దీనికి ఉభయు కంటక, అజప్రియ, కోల, ఫేనిల అనేవి పర్యాయనామాలు. దీని శాస్త్రీయ నామము ziziphus jujuba, కుటుంబం- రామ్నేసి.
దీనికి గుండ్రని ఆకులు, ముళ్ళు, గుండ్రని ఫలములు ఉంటాయి. దీని ఫలములు గుండ్రంగా, కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, కొన్ని కోలగా ఉంటాయి. వైద్య శాస్త్రంలో “భుక్త్వాతు బదరీఫలం” అని చెప్పబడినది. భోజనానంతరం బదరీ ఫలము సేవించితే ఆహారము బాగా జీర్ణమవడమే కాకుండా, లంబోదరము కలగకుండా ఉంటుంది.