దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

0
2493
Zodiac Signs Dosha & Goddess Durga Worship During Navratri
Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

Individual Zodiac Signs Dosha Remedies During Devi Navratri

దుర్గాదేవి ఆరాధనతో నవరాత్రి సమయంలో రాశుల దోషాల నివారణ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశి వారికి చిన్నదో లేక పెద్దదో ఏదో ఒక దోషం ఉంటుంది. కాని కొన్నింటికి నివారణలు ఉంటే అవి ఎప్పడు చేయాలో తెలియదు. ఎప్పుడు చేయాలో తెలిసినా ఏమి నివారణ చేయాలి?, ఎవరితో చేపించాలి?, ఎక్కడ చేయాలి?, నివరణ చేస్తే దోషం పోతుందా లేదా? అనే వివిధ రకాలైన అనుమానాలు ప్రతి ఒక్కరి మదిలో ఉంటాయి. ఇప్పుడు మేము మీ సందేహాలన్నింటిని నివృత్తి చేస్తాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

వ్యక్తిగత రాశులు & వాటి దోష నివారణలు (Personal Horoscopes & Their Dosha Remedies)

మీ సందేహాలనంటికి ఒకటే సమధానం అదే దేవి శరన్నవరాత్రుల రోజులు. ఒక్కో రాశికి ఏమి దోషాలు ఉన్నాయి వాటికి చేయవలసిన నివరణలు తెలుకుందాం.

మేష రాశి (Aries)

సమస్యలు: చదువు, ఉధ్యోగం, ధన భయాందోళనలు, అనారోగ్య సమస్యలు

ఈ రాశి వారు సరస్వతి హోమం, ప్రతి నిత్యం జరిగెటువంటి చండీ హోమం, రాజ శ్యామల యాగం చేయడం వల్ల బృహస్మతి మరియు రాహు యొక్క గ్రహ దోష నివృత్తికి చాల బాగా ఉపయోగపడుతాయి. తద్వార చదువు, ఉధ్యోగం, ధనం భయాలు, అంధోనలను, అనారోగ్య సమస్యలకు సంభందించిన దోషాల నివృత్తి జరుగుతాయి.

నివరణలు: సరస్వతి హోమం, చండీ హోమం, రాజ శ్యామల యాగం

వృషభ రాశి (Taurus)

సమస్యలు: అధికార భయం, అగ్ని భయం, కోర్ట్ కేసు సమస్యలు

ఈ రాశి వారు నిత్యం జరిగెటువంటి చండీ హోమం, రాజ శ్యామల యాగంతో పాటుగా లలితా పరమేశ్వరి ఆరాధనం చేయటం వల్ల ఈ రాశి వారికి ఐశ్వర్య ప్రదం మరియు సౌఖ్యం కలుగుతాయి.

నివరణలు: చండీ హోమం, రాజ శ్యామల యాగం, లలితా పరమేశ్వరి ఆరాధనం

మిధున రాశి (Gemini)

సమస్యలు: కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాక్కు సమస్యలు

మిధున రాశి వారికి సాధరణ సంకల్పం ఆధారంగా ఏకాదశంలో రాహువు; పంచంలో కెతువు రెండు గ్రహాల దోష ప్రభావం వల్ల వీరు లక్ష్మి హృదయ యాగం చేయడం వల్ల చాలా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

నివరణ: లక్ష్మి హృదయ యాగం

కర్కాటక రాశి (Cancer sign)

సమస్యలు: ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు

కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అర్ధాష్టమంలో ఉండటం వల్ల విశేషమైన అమ్మ వారి ఆరాధన; దేవినవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకంగా మహాలక్ష్మి యాగాన్ని చేయడం చాల శుభప్రదం.

నివరణ: మహాలక్ష్మి యాగం

సింహ రాశి (Leo)

సమస్య: ఆత్మ విశ్వాసం తగ్గుతుంది

సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు నీచంగా ఉండటం వలన వీరికి బగళాముఖీ యాగం చాల విశేషమైన ఫలాన్ని ఇస్తుంది.

నివరణ: బగళాముఖీ యాగం

కన్య రాశి (Virgo)

సమస్యలు: అధిక ఖర్చులు, కుటుంభ కలహాలు

కన్య రాశి వారికి శుక్రుడు వ్యయంలో ఉండి గ్రహ దోషాన్ని ఇస్తున్నాడు కాబట్టి శుక్ర గ్రహ ప్రీతీ కోసం వీరు పార్వతి యాగాన్ని ఆచరిస్తే సర్వత్ర సుఖాలు & సంతోషాలు కలుగుతాయి.

నివరణ: పార్వతి యాగం

తులా రాశి (Libra)

సమస్యలు: భార్య భర్తల కలహాలు, ఆరోగ్య సమస్యలు, నిరాశ చెందడం

తులా రాశి వారు జన్మ రాశులొనే కెతువు, గురుడు, బుధుడు మరియు రవి గ్రహాలు వ్యతిరేకంగా ఉండటం వలన వీరు 9 రోజుల పాటు జరిగే దేవినవరాత్రులలో భాగస్వాములయితే అంతా మంచే జరుగుతుంది.

నివరణ: దేవినవరాత్రులలో భాగస్వాములయితే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చిక రాశి (Scorpio)

సమస్యలు: ఆర్ధిక, కుటుంబ మరియు మంత్ర సంభంధమైన సమస్యలు

వృశ్చిక రాశి వారికి ఆరవ ఇంట్లో బృహాస్మతి & రాహువు ఉండటం వలన ఆర్ధిక, కుటుంబ మరియు మంత్ర సంభంధమైన సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వీరు సరస్వతి ఉపాసన మరియు సరస్వతి యాగం అలాగే మహాలక్ష్మి యాగం చేస్తే వీరికి చాలా శుభం జరుగుతుంది.

నివరణలు: సరస్వతి ఉపాసన, సరస్వతి యాగం, మహాలక్ష్మి యాగం

ధనుస్సు రాశి (Sagittarius)

సమస్యలు: సంతాన సమస్యలు, జ్ఞాన సంబంధ సమస్యలు

ధనుస్సు రాశి వారికి రాశి అధిపతి గురుడు ఉండటం వలన బృహాస్మతి దోషం ఉంది. అందుకే మహా చండీ హోమం & రాజ శ్యామల యాగంతో పాటుగా బగళాముఖీ యాగం చేయడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది.

నివరణలు: మహా చండీ హోమం, రాజ శ్యామల యాగం, బగళాముఖీ యాగం

మకర & కుంభ రాశులు (Capricorn & Aquarius)

సమస్యలు: ఆరోగ్య & ఆర్ధిక సమస్యలు

మకర & కుంభ రాశుల వారికి రాశి అధిపతి శని వక్రగతిలో ఉండటం మూలానా ఆరోగ్య & ఆర్ధిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యల నివృత్తి కోసం వీరు ప్రతి రోజు చండీ మరియు రాజ శ్యామల యాగంలో పాల్గోంటు వీటితో పాటుగా మహాలక్ష్మి యాగంలో భాగస్వాములయితే చాల విశేషమైన ఫలితం ఉంటుంది.

నివరణలు: మహా చండీ హోమం, రాజ శ్యామల యాగం, మహాలక్ష్మి యాగం

మీనా రాశి (Pisces)

సమస్య: ఆరోగ్య సమస్యలు

మీనా రాశి వారికి గోచరాం వల్ల ఎనిమదవ ఇంట్లో 4 గ్రహాలు ఉండటం వల్ల ఆరోగ్యం అంతగా బాగుండదు. కాబట్టి వీరు దేవి నవరాత్రి ఉత్సవాలలో రాహు, కెతువు & ఇచ్చాది గ్రహాల యొక్క ప్రభావాల నుండి బయటపడటానికి & అష్టమంలో ఉన్న గ్రహాల దోష నివృత్తికి కూడా రాజ రాజేశ్వరి యాగాన్ని ఆచరించినట్లయితే అనేక రకాల సమస్యల పరిస్కారం అవుతాయి.

నివరణ: రాజ రాజేశ్వరి యాగం

రోజు వారి పూజా షెడ్యూల్ (Day-Wise Ritual Schedule)

రోజు తేదీ హోమం
మొదటి రోజు 15-10-2023 బాల హోమం
రెండవ రోజు 16-10-2023 లలిత హోమం
మూడవ రోజు 17-10-2023 మహా లక్ష్మీ హోమం
నాల్గవ రోజు 18-10-2023 శ్రీ విద్యా హోమం
అయిదవ రోజు 19-10-2023 లక్ష్మీ హృదయ హోమం
ఆరవ రోజు 20-10-2023 బగళాముఖీ యాగం
ఏడవ రోజు 21-10-2023 సరస్వతీ హోమం
ఎనిమదవ రోజు 22-10-2023 స్వయంవర పార్వతీ హోమం
తోమ్మిదవ రోజు 23-10-2023 రాజ రాజేశ్వరీ హోమం

సేవాలకు విరాళాలు (Contributions for Sevas)

హోమం రుసుము (Amount) రోజుల సంఖ్య
చండీ హోమం ₹ 1,000 ఒక రోజు
₹ 5,000 తొమ్మిది రోజులు
శ్రీ రాజశ్యామల హోమం ₹ 1,000 ఒక రోజు
₹ 10,000 తొమ్మిది రోజులు
విశేష హోమం ₹ 1,000 పది రోజులు
కుంకుమార్చణ ₹ 500 తొమ్మిది రోజులు
అన్ని సేవలు ₹ 21,000 తొమ్మిది రోజులు

Pay Here

నియమాలు:

  • మీరు హాజరు కావాలనుకునే ప్రతి వ్యక్తిగత సేవకు చెల్లించండి.
  • అన్ని సేవలలో పాల్గొనడానికి సమగ్ర నవరాత్రి ప్యాకేజీని ఎంచుకోండి.

మీ ఈ సహకారం మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విజయవంతం చేయడమే కాకుండా వేద విద్యార్ధుల శ్రేయస్సుకు తోడ్పడుతుంది. ఈ దైవిక వేడుకలో మాతో చేరండి మరియు సనాతనధర్మంలో భాగస్వాములు అవ్వండి.

మరింత సమాచారం కోసం మరియు మీ స్థానాన్ని రిజర్వ్ చేసుకోవడానికి, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

విద్యారణ్యంలో నవరాత్రి సందర్భంగా దుర్గామాత యొక్క దైవిక సన్నిధిని మనం కలిసి, ఆశీర్వాదాలు కోరుకుందాం.

మీ పేరు మీద చేసే హోమాలా వీడీయోలు లైవ్ లో చూడవచ్చు, ఒకవేళ లైవ్ లో చూడలేకపొతే రికార్డ్ చేసిన వీడియోలు ఇవ్వబడును. అదే విధంగా హోమంలో పెట్టిన ప్రసాదం కొరియర్ చేయబడును.

Note: ఈ దోష నివారణలకు మీ తరుపున మేము పైన చెప్పబడిన విధంగా మీ గోత్రనామలతో హోమాలు మరియు యాగాలు చేస్తాము. క్రింద లింక్ లో రిజిస్టర్ అవ్వండి.

 

Navaratri Durga Puja Related Posts

ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవ కార్యక్రమములు 2023 విశేషాలు & విశిష్ఠత | Srisailam Temple Durga Navratri 2023 Dasara Pooja

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

అక్టోబర్‌లో సూర్య, చంద్ర గ్రహణాలు | నవరాత్రి పూజపై గ్రహణం ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది?! | Solar, Lunar Eclipses Impact on Navratri 2023

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals

శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర, ఆలయం & పూజ విధానం | Sri Maha Chandi Devi History

నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి? | Devi Navaratri Udyapana Procedure

శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dussehra Devi Sharan Navaratri Pooja Vidh & Rules in Telugu