ఆయుర్వేద పరంగా కలబంధ | Ayurveda Benfits Of Aloe Vera in Telugu

1
5088
ఆయుర్వేద పరంగా కలబంధ | Ayurveda Benfits Of Aloe Vera in Telugu
Ayurveda Benfits Of Aloe Vera in Telugu

Ayurveda Benfits Of Aloe Vera in Telugu

కలబంధ ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది. గుజ్జులో సుమారు 20 రకాల ఆమోనీ ఆసిడ్లు, కార్భోహైడ్రేడ్లు మరియు ఇతర రసాయ బార్భలోయిన్‌ అనేగ్లూకో సైడులు ఉంటాయి. ఇవే కాకుండా విటమిన్‌ మానోజ్‌ అనే చక్కెర పదార్థాలు, మాంగనీస్‌, మెగ్నీషియం, పోటాషియం, కాల్షియం, కాపర్‌, జింక్‌ వంటి మూలకాలు మరియు ఆంత్రో క్వినోన్స్‌కూడా ఉం టాయి.కలబంద గుజ్జును చెక్కెర తో కలిపి సేవించడము గాని ,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని ,ఆరోగ్యాన్ని పొందవచ్చు.కలబంద రసం ,పాలు ,నీళ్ళతో కలిపి సేవిస్తే ,సెగ రోగం ,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.

కలబంద గుజ్జు చలువ చేస్తుంది. నేత్ర రోగాలలో, కాలిన గాయా లను మాన్పు టకు, స్త్రీలలో వచ్చేగర్భాశయ వ్యాధు లలోనూ, ప్లీహము దీర్ఘకాలిక పుండ్ల నివారణకు, కండ్లకలకలకు, మూల వ్యాధి కాలేయం సంబంధ వ్యాధులలోనూ, మూత్ర కోశ సంబంధ వ్యాధుల లోనూ, రుతు సంబంధ చికిత్సలకు ఉపయోగపడు తుంది.

కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.
కలబంద రసం లేదా వేరు ను పసుపు తో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.
కలబంద రసాన్ని పసుపు తో కలిపి సేవిస్తే లివర్ ,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.
కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.
రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.

కలబంద ఆకుల రూపంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చలు తగ్గుతాయి

కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.
కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు ,సూర్య తాపము వలన ,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.
చర్మ సౌందర్యానికి ,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను ,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక ,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.

ఉదయం పరగడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి. రోజ్‌వాటర్‌లో కలబంద రసాన్ని కలుపుని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.

ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.
కలబంద గుజ్జు ను నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.

కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మటు మాయమవుతాయి.

దగ్గు నివారణకై 1 స్పూన్ ,మిరియాలు 1/4 స్పూన్ , శొంటి 1/4 స్పూన్ ,తేనె లో కలిపి సేవించాలి.
కడుపు నొప్పి లోను ,కడుపు లో గ్యాస్ ఏర్పడినపుడు ,గోధుమ పిండి ,కలబంద గుజ్జు పై వాము ,సైంధవ లవణము ,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here