సికింద్రాబాదులోని సూర్య దేవాలయాన్ని దర్శించారా..? | Surya Devalayam secunderabad in Telugu

1
13978
have-you-visited-temple-of-lord-surya-in-hyderabad
Surya Devalayam secunderabad in Telugu

Surya Devalayam secunderabad in Telugu

ఈ భూమండలం పై ప్రతి ప్రాణీ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుని వెలుగుపై ఆధారపడి జీవిస్తుంది. అందుకే ప్రతి మతం లోనూ , ప్రతి తెగలోనూ ఆయనను ప్రాథమికంగా ఆరాధిస్తారు. నిరంతర తేజో శక్తిని ప్రసాదించే ఆ సూర్య భగవానుని ఆలయాలు కొంత అరుదుగానే కనిపిస్తాయి. అలా అరుదుగా కనిపించే సూర్య భగవానుని ఆలయాలలో ఒకటి మన సికింద్రాబాదు లోని తిరుమల గిరి లో ఉంది. ప్రకృతి ఒడిలో, సువిశాల ప్రాంగణం లో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం లో ఈ ఆలయం నిత్య పూజలతో అలరారుతూ ఉంది.

శ్రీ సూర్య శరణ్ దాస్ మహరాజ్ అనే సూర్యారాధకునికి  ఆ సూర్య భగవానుడు స్వయంభువుగా దర్శనమిచ్చి తన దేవాలయాన్ని నిర్మించవలసిందిగా ఆదేశించగా, స్వామి ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్ దాస్ మహరాజ్ 1959 లో ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఆలయ ప్రవేశ స్థానం లో ఉన్న మరకతగణపతి, శివాలయం, సరస్వతీ ఆలయం,నాగదేవత ఆలయం,శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం మరియు అశ్వత్థ వృక్షం ఆలయ మహిమను ద్విగుణీకృతం చేస్తున్నాయి.

రథసప్తమి రోజున ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. 12 ఆది వారాల పాటు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here