పక్షవాతం నివారణకు | How to Prevent Paralysis in Telugu

0
4468

1422339_452607508213403_6278916898233715565_n

 

* అక్కలకర్ర , సన్నరాష్ట్రం , శొంటి వీని తేలిక కషాయం పక్షవాతం హరించును.

* అంజీర పండు ఎండుది 40 దినాలు పెద్ధజీలకర్ర తో తినిన మేలు చెయును.

* ఆవాల చూర్ణం లొ నీళ్లు కలిపి పడిపోయిన బాగం మర్దన చేయాలి .

* కానుగ చెట్టు మాను బెరడు ఆముదంతో కాచి కాళ్లు , చేతులకు మర్దన చేయవలెను .

* కటుకరోహిని నల్లనిది చూర్ణం 5 గ్రా చొప్పున తీసుకున్న నివృత్తి అగును.

* కసవింద చెట్టు రసము వెన్నతో కలిపి మర్దన చేయవలెను .

* బొమ్మజెముడు పాలలొ నూనెపోసి కాచి మర్దించాలి.

* కామంచి ఆకు పసరు 3 తులములు , నల్లమందు పావు తులం కలిపి నూరి మూతికి పట్టు వేసుకుంటే వంకరపోయిన మూతి సరి అగును.

* కాజపుట్ తైలం , కొబ్బరి నూనె లేక బాదం నూనెలో వేసుకుని మర్దించాలి.

* కుసుమ విత్తుల నుండి తైలం తీసి మర్దించిన తగ్గును .

* కారుమునగ చెట్టు వేరు పైన ఉండే చెక్క నూరి నూనెలో కలిపి పుసిన తగ్గును .

* గచ్చపప్పు తో తీసిన నూనె పుసిన పక్షవాతం హరించును.

* జాజికాయ ని నీటితో గంధం తీసి గాని , నూరి గాని పట్టువేస్తే పక్షవాతం తగ్గును .

* పక్షవాతం వచ్చిన వెంటనే గిద్ద తేనే 2,3 పర్యాయాలు తాగిన పక్షవాతం పోవును .

* వేయించిన ఇంగువ 5 – 10 గ్రాములు తేనేతో రోజు రెండు పూటలా సేవించిన పక్షవాతం హరించును.

* ఖర్జూర కాయ పక్షవాత రొగులకు చాలా మేలు చెయును.

* అడివి పావురం రెట్టను మర్దన చేసిన పక్షవాతం నశించును.

* అడివి పావురం రక్తం కిందినుంచి పైకి పుయవలేను ( చచ్చుబడిన అంగముకు ).

* నేతితో వేయించిన ఇంగువను పావు గ్రాము నుండి అరగ్రాము తేనేతో కలిపి ఇచ్చిన పక్షవాతం తగ్గిపోవును.

దీనితో పాటు 1 బాగం తేనే 2 బాగాలు మంచి నీరు కలిపి 3 వంతులు మిగులునట్లుగా కాచి ఆ నీటిని పూటకు 10 మీ.లి చొప్పున రోజుకీ మూడుపూటలా సేవించిన మూతి వంకర అగు రోగం తగ్గించును.

పళ్ళకి తగలకుండా ఇంగువ మింగవలెను .

* సారాయిలో శొంటి అరగదీసి ఆ గంధంతో పట్టువేసిన పక్షవాతం హరించును.

* వెల్లుల్లి రెబ్బలు, పసుపు సమాన బాగాలుగా కలిపి మెత్తగా నూరి ఆ పేస్ట్ తో పట్టువేస్తుంటే పడిపొయిన బాగాలకు మరలా చలనం కలుగుతుంది. నొప్పులు తగ్గుతాయి . శరీరానికి చలువ కమ్మటం తగ్గుతుంది .

* వెల్లుల్లి పాయల రెబ్బల్ని వాటికి రెండింతలు నువ్వుల నూనె కలిపి మెత్తగా దంచి నూరి ఆ ముద్దను నిలువ చేసుకొవాలి . దీనిని ఉదయం , సాయంత్రం వేళల్లో తింటూ ఉంటే ముఖానికి ఆవరించిన పక్షవాతం నివారించ బడుతుంది.

* నల్లజీలకర్ర 20 గ్రా , వస 50 గ్రా , శొంటి 20 గ్రా ఈ పదార్దాలు మూడు కలిపి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి ఆ మెత్తటి చూర్ణం లొ తగినంత తేనేకలిపి నిలువ ఉంచుకుని పూటకు 3 గ్రా మోతాదుగా మూడు పూటలా తింటూ ఉంటే పక్షవాతం క్రమంగా తగ్గుతుంది .

* మిరియాలు , నువ్వుల నూనె కలిపి మెత్తటి గంధం లాగా నూరి పక్షవాతం వలన పడిపొయిన బాగం పైన పట్టువేయాలి.

దీనివలన పడిపొయిన అవయవం మళ్లి మాములుగా పనిచేస్తుంది . పక్షవాత రోగానికి దీనితో సమానం అయిన ఔషధం మరియొకటి లేదని ఆయుర్వేద శాస్త్రవేత్తల ఉవాచ ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం .

* నీరుల్లిరసం , అల్లంరసం , తేనే సమబాగాలుగా కలిపి పూటకు 30 గ్రా చొప్పున రెండు పూటలా శరీర శక్తిని బట్టి తీసుకుంటూ ఉంటే పక్షవాతం తగ్గిపొతుంది.

కాళహస్తి వెంకటేశ్వరరావు

https://www.facebook.com/ayurvedhamoolikaarahasyaalu/?fref=nf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here