
సావాస దోషం
మన స్నేహితులను చూసి మన వ్యక్తిత్వం ఏమిటో చెప్పవచ్చు అంటారు పెద్దలు. నిజమే. మనం ఎవరితో ఎక్కువ గా సమయాన్ని గడుపుతామో వారి అలవాట్లు ఆలోచనలు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మంచైనా చెడైనా మనమీద ఆ ముద్ర పడటం సహజం. మనుషులే కాదు వస్తువులు కూడా మనపై ప్రభావితం ఎంతగా చూపగలవో చెప్పే కథ తెలుసుకుందాం.
1. ఒక తపస్వి
ఒక బ్రహ్మచారి ఇంద్రపదవిని పొందటానికి ఘోరతపస్సుని ఆచరించడానికి తలపెట్టాడు. క్రమంగా అతను ధ్యాన యోగాదులను సాధన చేశాడు. అతని ప్రయత్నం విన్న ఇంద్రుడు ‘ఇంద్ర పదవిని సాధించాలంటే అరిషడ్వర్గాలను జయించాలి. వీరుడై ఉండాలి కానీ క్రూరత్వం ఉండరాదు. జ్ఞానియై ఉండాలి, కానీ గర్వం ఉండరాదు. కేవలం స్వర్గ సుఖాల కోసం ఇంద్రపదవిని ఆశించడం తప్పు. అటువంటివారు ఇంద్రపదవిని పొందితే లోక వినాశనం జరుగుతుంది. నేను అతని అర్హతను పరీక్షిస్తాను’. అన్నాడు.
Promoted Content