పోషకాల వెలగపండు | Nutritional Value of Wood Apple in Telugu

0
3841
Wood-apple_dec2007
పోషకాల వెలగపండు | Nutritional Value of Wood Apple in Telugu

పోషకాల వెలగపండు | Nutritional Value of Wood Apple in Telugu

వెలగపండులోనూ పోషకాలకూ లోటు లేదు. 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండే మంచి మందు. వాస్కోడిగామా బృందం ఓసారి కలరా, డయేరియాలతో బాధపడుతుంటే ఈ పళ్ల గుజ్జునే మందుగా ఇచ్చారట.

వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో మంచిది. రక్తహీనత లేకుండా చేస్తుంది. గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది.

ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి.

అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది.

మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. రాళ్లు కూడా తొలగిపోతాయి.

బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కాలేయ సమస్యలనూ నివారిస్తోంది. హృద్రోగులకూ మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కంటికీ మంచిది.

స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది.

పండే కాదు.. ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. కానీ వేసవి వరకూ ఇవి దొరుకుతూనే ఉంటాయి. మరి ఇప్పటికైనా ఈ చెట్లను చేను గట్లమీదా, బీడుపొలాల్లోనూ వేద్దాం.. వెలగపండ్ల రుచుల్నీ ఆస్వాదిద్ధాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here