మన ఆలోచనలనుబట్టే మన గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఒక విషయాన్ని మనం యే దృష్టితో చూస్తామో మనకు అదే ప్రభావం కనబడుతుంది. ‘యద్భావం తద్భవతి’ అంటారు పెద్దలు. మన ఆలోచనలు మంచివి అయితే మనకు మంచి జరుగుతుందని నిరూపించే ఒక చిన్న కథ తెలుసుకుందాం.
1. ఇద్దరు విద్యార్థులు
మాధవుడనే గురువు ఆశ్రమం లో శ్రీ కరుడు, విక్రముడు అని ఇద్దరు విద్యార్థులు ఉండేవారు. శ్రీకరుడు ప్రతి విషయాన్నీ మంచిగానే చూసేవాడు. ఏమి జరిగినా దాని నుంచీ మంచిని గ్రహించేవాడు. విక్రముడు అందుకు పూర్తి వ్యతిరేకం ప్రతిదాంట్లోనూ అతనికి చెడే కనిపించేది. ఒకనాడు విక్రమునికి మంచి ఆలోచనల గొప్పదనాన్ని నేర్పాలనీ, శ్రీకరుని సద్బుద్ధిని అందరికీ తెలియజేయాలనీ వారి గురువు మాధవుడు నిశ్చయించుకున్నారు.
Promoted Content