Pradosha Kalam In Telugu | ప్రదోష వేళ అంటే ఏమిటి?

1
73740
Pradosha Kalam
What is Pradosha Kalam / Time?

What is Pardosha Kalam?

ప్రదోష కాలం అంటే ఏమిటి?

ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతి రోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి, మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశి లలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును. మిగతా విషయాల కోసం పక్క పేజిలోకి వెళ్ళండి

ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత తొమ్మిది ఘడియల లోపల చతుర్థి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగును. అటులే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి రెండు ఘడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత పదహైదు ఘడియల లోపల సప్తమి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగును. అటులే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత సప్తమి ఒక్క ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఏ దినమందు సూర్యోదయము తర్వాత అరవై ఘడియల లోపల త్రయోదశి తిథి వచ్చునో, ఆ దినము ప్రదోషము కలుగును. అటులే, ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత త్రయోదశి అర్ధ ఘడియైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఈ త్రయోదశీ ప్రదోషము అవధిని ఇలాగ లెక్క కట్టెదరు. సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ ఇంచుమించు అర్ధరాత్రి వరకూ ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర రెండున్నర ఘడియలూ, తర్వాత రెండున్నర ఘడియలూ అంటారు. (ఒక ఘడియ = 24 నిమిషాలు) ఈ ప్రదోష దినము అనధ్యయనము. సర్వ విద్యలకూ గర్హితమైనది. సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది. ఆ సమయములో ప్రదోషమైనచో, కొన్ని అనుష్ఠానములు చేయ వలెను. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు, కాబట్టి శివ పూజ మాత్రమే చేయవలెను అనునది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వచ్చును. కానీ కృష్ణ పక్షములో చతుర్దశి రోజు మాస శివరాత్రి వచ్చును. దాని వెనుకటి రోజు త్రయోదశిలో మహా ప్రదోష కాల శివ పూజ విధించబడినది. శుక్ల పక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత గలదు. ఆ రోజు కూడా శివ పూజనే చేయవలెను. ప్రదోషమంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజూ ఎన్నో పాప కర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాప కర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయవలెను. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథ గణాలతో కొలువై మన పూజలు అందుకొనుటకు సిద్ధంగా ఉండు సమయమది. మన పాప కర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి, మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును. ఈ త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి యనీ, సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ పిలుస్తారు. ఇవి కాక, గురువారము నాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము గలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా, ఈ మూడు రోజులూ మాత్రము మరింత విశేషమైనవి. శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకము లోని శని ప్రభావము కూడా తొలగింపబడును. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలవబడుతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడితడు. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోషపూజతో పోగొట్టుకొనవచ్చును. సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగును. సోమవారము శివుడికి ప్రీతి పాత్రమైనది. ఆరోజు చేసిన శివపూజ సర్వ పాప హరము, సర్వ పుణ్యదము. ఇక గురువారము త్రయోదశీ ప్రదోషము వస్తే, ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి, విద్యాబుద్ధులు, సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు, మరియు ధన కారకుడు. జాతకములో గురు దోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే. మిగతా విషయాల కోసం పక్క పేజిలోకి వెళ్ళండి

ఈ త్రయోదశీ ప్రదోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్త పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణెడు నీళ్ళు పోస్తే చాలు, పొంగిపోతాడు, భోళా శంకరుడు. మిగతా విషయాల కోసం పక్క పేజిలోకి వెళ్ళండి

Post Copied from (Source of Content) : Janardhana Sharma

Pradosham 2024 Dates

Date
Type of Pradosh Vrat
Timing
Time Duration
Thidhi
January 9, 2024, Tuesday Bhauma Pradosh Vrat 05:58 PM to 08:32 PM 02 Hours 34 Mins Pausha, Krishna Trayodashi
Begins – 11:58 PM, Jan 08
Ends – 10:24 PM, Jan 09
January 23, 2024, Tuesday Bhauma Pradosh Vrat 06:06 PM to 08:39 PM 02 Hours 33 Mins Pausha, Shukla Trayodashi
Begins – 07:51 PM, Jan 22
Ends – 08:39 PM, Jan 23
February 7, 2024, Wednesday Budha Pradosh Vrat 06:14 PM to 08:45 PM 02 Hours 30 Mins Magha, Krishna Trayodashi
Begins – 02:02 PM, Feb 07
Ends – 11:17 AM, Feb 08
February 21, 2024, Wednesday Budha Pradosh Vrat 06:20 PM to 08:48 PM 02 Hours 28 Mins Magha, Shukla Trayodashi
Begins – 11:27 AM, Feb 21
Ends – 01:21 PM, Feb 22
March 8, 2024, Friday Shukra Pradosh Vrat 06:25 PM to 08:49 PM 02 Hours 25 Mins Phalguna, Krishna Trayodashi
Begins – 01:19 AM, Mar 08
Ends – 09:57 PM, Mar 08
March 22, 2024, Friday Shukra Pradosh Vrat 06:27 PM to 08:50 PM 02 Hours 22 Mins Phalguna, Shukla Trayodashi
Begins – 04:44 AM, Mar 22
Ends – 07:17 AM, Mar 23
April 6, 2024, Saturday Shani Pradosh Vrat 06:30 PM to 08:49 PM 02 Hours 19 Mins Chaitra, Krishna Trayodashi
Begins – 10:19 AM, Apr 06
Ends – 06:53 AM, Apr 07
April 21, 2024, Sunday Ravi Pradosh Vrat 06:34 PM to 08:50 PM 02 Hours 16 Mins Chaitra, Shukla Trayodashi
Begins – 10:41 PM, Apr 20
Ends – 01:11 AM, Apr 22
May 5, 2024, Sunday Ravi Pradosh Vrat 06:38 PM to 08:52 PM 02 Hours 14 Mins Vaishakha, Krishna Trayodashi
Begins – 05:41 PM, May 05
Ends – 02:40 PM, May 06
May 20, 2024, Monday Soma Pradosh Vrat 06:43 PM to 08:55 PM 02 Hours 12 Mins Vaishakha, Shukla Trayodashi
Begins – 03:58 PM, May 20
Ends – 05:39 PM, May 21
June 4, 2024, Tuesday Bhauma Pradosh Vrat 06:48 PM to 08:59 PM 02 Hours 11 Mins Jyeshtha, Krishna Trayodashi
Begins – 12:18 AM, Jun 04
Ends – 10:01 PM, Jun 04
June 19, 2024, Wednesday Budha Pradosh Vrat 06:53 PM to 09:03 PM 02 Hours 10 Mins Jyeshtha, Shukla Trayodashi
Begins – 07:28 AM, Jun 19
Ends – 07:49 AM, Jun 20
July 3, 2024, Wednesday Budha Pradosh Vrat 06:55 PM to 09:05 PM 02 Hours 10 Mins Ashadha, Krishna Trayodashi
Begins – 07:10 AM, Jul 03
Ends – 05:54 AM, Jul 04
July 19, 2024, Friday Shukra Pradosh Vrat 06:53 PM to 07:41 PM 00 Hours 47 Mins Ashadha, Shukla Trayodashi
Begins – 08:44 PM, Jul 18
Ends – 07:41 PM, Jul 19
August 1, 2024, Thursday Guru Pradosh Vrat 06:49 PM to 09:03 PM 02 Hours 13 Mins Shravana, Krishna Trayodashi
Begins – 03:28 PM, Aug 01
Ends – 03:26 PM, Aug 02
August 17, 2024, Saturday Shani Pradosh Vrat 06:40 PM to 08:56 PM 02 Hours 16 Mins Shravana, Shukla Trayodashi
Begins – 08:05 AM, Aug 17
Ends – 05:51 AM, Aug 18
August 31, 2024, Saturday Shani Pradosh Vrat 06:30 PM to 08:49 PM 02 Hours 18 Mins Bhadrapada, Krishna Trayodashi
Begins – 02:25 AM, Aug 31
Ends – 03:40 AM, Sep 01
September 15, 2024, Sunday Ravi Pradosh Vrat 06:18 PM to 08:39 PM 02 Hours 21 Mins Bhadrapada, Shukla Trayodashi
Begins – 06:12 PM, Sep 15
Ends – 03:10 PM, Sep 16
September 29, 2024, Sunday Ravi Pradosh Vrat 06:06 PM to 08:30 PM 02 Hours 24 Mins Ashwina, Krishna Trayodashi
Begins – 04:47 PM, Sep 29
Ends – 07:06 PM, Sep 30
October 15, 2024, Tuesday Bhauma Pradosh Vrat 05:54 PM to 08:21 PM 02 Hours 27 Mins Ashwina, Shukla Trayodashi
Begins – 03:42 AM, Oct 15
Ends – 12:19 AM, Oct 16
October 29, 2024, Tuesday Bhauma Pradosh Vrat 05:46 PM to 08:15 PM 02 Hours 30 Mins Kartika, Krishna Trayodashi
Begins – 10:31 AM, Oct 29
Ends – 01:15 PM, Oct 30
November 13, 2024, Wednesday Budha Pradosh Vrat 05:41 PM to 08:13 PM 02 Hours 32 Mins Kartika, Shukla Trayodashi
Begins – 01:01 PM, Nov 13
Ends – 09:43 AM, Nov 14
November 28, 2024, Thursday Guru Pradosh Vrat 05:40 PM to 08:14 PM 02 Hours 34 Mins Margashirsha, Krishna Trayodashi
Begins – 06:23 AM, Nov 28
Ends – 08:39 AM, Nov 29
December 13, 2024, Friday Shukra Pradosh Vrat 05:44 PM to 07:40 PM 01 Hour 56 Mins Margashirsha, Shukla Trayodashi
Begins – 10:26 PM, Dec 12
Ends – 07:40 PM, Dec 13
December 28, 2024, Saturday Shani Pradosh Vrat 05:51 PM to 08:26 PM 02 Hours 35 Mins Pausha, Krishna Trayodashi
Begins – 02:26 AM, Dec 28
Ends – 03:32 AM, Dec 29

 

Related Posts

Pradosha Pooja & Vrath 2024 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

Gita Jayanti 2023 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?

వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

Vaikunta Ekadasi 2023 in Telugu | వైకుంఠ ఏకాదశి | Mukkoti Ekadasi 2023 Date, Significance & Puja Vidh

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Matsya Dwadashi 2023 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ | Rituals & Vrat

Pradosha Pooja & Vrath 2024 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

Datta Jayanti 2023 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర | History Of Sri Dattatreya In Telugu

Annapurna Jayanti 2023 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

Sankashtahara Chaturthi 2023 Dates | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here