
History of Shiva Temple – సర్వ పాప హరుడైన హరుడు రోగాలను బాపే వైద్యునిగా ఒక ఆలయం లో దర్శనమిస్తాడు. అదే తమిళనాడు లోని వైతీశ్వరాలయం. నవగ్రహాలలో ఒకడైన కుజునికి ఇది అనుసంధానమైన ఆలయంగా చెబుతారు. ఒకనాడు శాపవశాత్తు కుజుడు కుష్టురోగాన్ని పొంది పరమ శివుని ప్రార్థించగా కుజుని ప్రార్థనకు కరుణించి శివుడు వైద్యనాధునిగా దర్శనమిచ్చి అతని కుష్టురోగాన్ని నయం చేశాడు. అప్పటినుంచీ మహాదేవుడు భక్తుల కోరికమేరకు అక్కడే కొలువుతీరి ఉన్నాడు. వైతీశ్వరాలయం లో శివుని దర్శించిన వారు ఎన్నో భయంకరమైన వ్యాధులనుంచీ విముక్తి పొందారు. ప్రాచీన కాలం లో ఈ ప్రాంతాన్ని పుల్లిరుక్కువేలూర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతం నాడీజ్యోతిషానికి చాలా ప్రసిద్ధమైనది.
మద్రాసుకు 235 కిలోమీటర్ల దూరం లోనూ, చిదంబరానికి 27 కిలోమీటర్ల దూరం లోనూ వైతీశ్వరాలయం కొలువుదీరి ఉంది.