
History Of Tirumala Temple
15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది.
సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది.
ఇదే తిరుమల ఆలయం లో మొట్టమొదటి కానుక గ దేవాలయం లో ని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.
సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలను నిర్మించాడు.
1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు.
అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు, ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు.
వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు.
ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు.
తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచీ తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టరు చేసేవారు.
ఆలయ ఆదాయవ్యయాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామికి సేవలు, ఉత్సవాలు నిర్వహించడం, మిగిలిన సొమ్ము(అప్పట్లోనే దాదాపు సంవత్సరానికి రూ.లక్ష) కంపెనీ ఖజానాలో జమకట్టేవారు. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున అలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు.
90 ఏళ్ళ పాటు మహంతుల నిర్వహణ తరువాత,1933లో అప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు.
19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అతికొద్దిగా ఉండే ఇళ్ళు అత్యంత సంకుచితంగా ఉండేవి.
కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే వుండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు.
1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ.26 వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది.
1980 లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.
U have told about universe very nic according to our veedaas. What is history of dipaavali. If satya Ghana killed naraka on chaturdashi why celebrating festival on amavaasya? I haven’t deep knowledge in puranas like u. If u have knowledge clarify me pls.
keep follow this web site maximum data we will update
Wandar full information.pls send your cell no I will call you with you prameshan
. thanks