
Types of Namaskar in Telugu
నమస్కారము చేయడం అనేది శిష్టాచారం. ఇది నాల్గు విధాలు.
- సాష్టాంగ నమస్కారం,
- దండ ప్రణామం,
- పంచాంగ నమస్కారం,
- అంజలి నమస్కారం.
1. 1. సాష్టాంగ నమస్కారం.
మనస్సు బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం.
భక్తి భారావనమిత మనోబుద్ధ్యభిమాన పదద్వయ కరద్వయ శిరోభి
రష్టాంగే రచింతిత పాంశు కర్దము కర్మరాది కేధరాతలే దండచత్ ప్రణీ పతనమ్
అంటే భక్తి భారముచే వంగిన మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు కాళ్లు, రెండు చేతులు, శిరస్సు అనెడి అష్టాంగాలతో దుమ్ము, బురద, గులకరాళ్లు కలవని విచారించక భుమిపై కర్రవలె పడి చేయు నమస్కారం.
Promoted Content